📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు

📰 Generate e-Paper Clip

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు
పంచాయతీలకు అదనపు ఆదాయం.. గ్రామీణ ప్రాంతాలకు ఎలక్ట్రిక్ వాహనాల సౌకర్యం
కూసుమంచి నవంబర్ 3 (మన ప్రజావాణి) ప్రతినిధి RK :
దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. న్యూఢిల్లీలో శనివారం ఈ ఒప్పందం జరిగింది.
ఈ పథకంలో భాగంగా గ్రామ పంచాయతీల పరిధిలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు, గ్రామీణ ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29,151 పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఉండగా, ఈ సదుపాయాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.