📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్భక్తిశ్రద్ధలతో వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే

భక్తిశ్రద్ధలతో వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

భక్తిశ్రద్ధలతో వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే

నియోజక వర్గ పార్టీ నేత వెంకన్న చౌదరి

పలాస, ప్రజావాణి ప్రతినిధి

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పట్టణంలో గల లక్కీ షాపింగ్ మాల్, ఎండిఓ ఆఫీస్ రోడ్డు, పలాస హరిజన వీధిలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష  ఆమె భర్త నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి  సందర్శించి, భక్తిశ్రద్ధలతో బుజ్జి వినాయకుని దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు.వినాయక చవితి పర్వదినం సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించడం జరిగింది. భక్తులు, స్థానికులు, వినాయక ఉత్సవ నిర్వాహకులతో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆప్యాయంగా మమేకమయ్యారు.ఈ కార్యక్రమంలో పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని, విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే గౌతు శిరీష  ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.