పోరుమామిళ్ల కాపు వీధిలో శ్రీ విఘ్నేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ప్రత్యేక పూజలు నిర్వహించిన పోతిరెడ్డి నాగార్జున రెడ్డి
పోరుమామిళ్ల, సెప్టెంబరు 14:ప్రజావాణి వైభవంగా జరుగుతున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారు వినాయక చవితి పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం పోరుమామిళ్ల గ్రామంలోని కాపు వీధిలో స్థానిక భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారు హాజరయ్యారు.
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు:
ఈ సందర్భంగా కాపు వీధిలోని గణనాథుని మండపానికి చేరుకున్న పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కి నిర్వాహకులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారి విగ్రహం వద్ద కూర్చుని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అర్చనలు, హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో నాగార్జున రెడ్డి వెంట ప్రముఖ నాయకులు డాక్టర్ మార్కా రెడ్డి, విగ్రహ దాత గొంగల్ రెడ్డి రామిరెడ్డి, డాక్టర్ పి. సుబ్బారెడ్డి, దేశాయి చైతన్య రెడ్డి, ఓబయ్య, రమణ లతో పాటు స్థానిక నాయకులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి – పోతిరెడ్డి నాగార్జున రెడ్డి:
పూజా అనంతరం పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.ఆపదలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించే విఘ్ననాయకుడైన ఆ విఘ్నేశ్వర స్వామి కృపాకటాక్షాలు బద్వేల్ నియోజకవర్గ ప్రజలపై, రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో రైతాంగం వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని ఆయన కోరుకున్నారు.
శాంతిభద్రతలతో పండుగ జరుపుకోవాలి:
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నాగార్జున రెడ్డి సూచించారు. గ్రామాల మధ్య, యువత మధ్య ఎలాంటి పొరపచ్చాలు రాకుండా, శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా, క్రమశిక్షణతో మరియు జాగ్రత్తలతో పండుగను ఒక పవిత్రమైన పండుగలా జరుపుకోవాలని ఆయన నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా పిలుపునిచ్చారు.ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో పోరుమామిళ్ల కాపు వీధిలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. స్థానిక మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

