వైఎస్సార్ కడప జిల్లా సెప్టెంబర్ 13 ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పోరుమామిళ్ల మండలం చెన్నారెడ్డిపేట సమీపంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సిక్స్ లైన్ (ఆరు వరసల) టన్నెల్స్ (సొరంగాలు) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శనివారం మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఈ టన్నెల్స్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్ట్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు మరియు కార్మికులతో మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆరు వరసల రహదారి మరియు టన్నెల్స్ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ పరిధిలోని టన్నెల్స్ నిర్మాణ పనులన్నీ రాబోయే డిసెంబర్ ఆఖరి నాటికి (ఈ ఏడాది చివరికల్లా) పూర్తిగా సిద్ధమవుతాయని అక్కడి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు తనకు స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు.
తగ్గనున్న ప్రయాణ దూరం.. పెరగనున్న అనుసంధానం:
ఈ అంతర్జాతీయ స్థాయి రోడ్డు నిర్మాణం పూర్తి అయితే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం విజయవాడ నుండి ఐటీ హబ్ బెంగళూరు నగరానికి వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.ఈ కొత్త రహదారి అందుబాటులోకి రావడం వల్ల విజయవాడ – బెంగళూరు మధ్య ప్రయాణం అత్యంత సులభతరం కావడమే కాకుండా, చాలా తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ఆయన వివరించారు.టన్నెల్స్ నిర్మాణం పూర్తయితే బద్వేల్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతాయని
,రవాణా ఖర్చులు మరియు సమయం భారీగా ఆదా అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికతతో, నాణ్యతా ప్రమాణాలతో ఈ పనులను వేగంగా పూర్తి చేస్తున్న మెగా కంపెనీ ప్రతినిధులను,ఇంజనీర్లను ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాల్గొన్నారు.

