📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguపస్రాలో శాంతి కమిటీ సమావేశం

పస్రాలో శాంతి కమిటీ సమావేశం

📰 Generate e-Paper Clip

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

వినాయక చవితి పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఎస్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముస్లిం పెద్దలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ తాజుద్దీన్ మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా మత సామరస్యం, ఐక్యతతో మెలగాలని సూచించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో పోలీసులకు సహకరించాలని కోరారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, పుకార్లను నమ్మవద్దని, అనుమానాస్పద విషయాలు ఏమైనా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. దీనికి ముస్లిం పెద్దలు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.