📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచౌటుప్పల్ లో ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

చౌటుప్పల్ లో ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

📰 Generate e-Paper Clip

చౌటుప్పల్ లో ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా – 70 కి పైగా కంపెనీల రాక – నిరుద్యోగులకు సువర్ణావకాశం: చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ లక్కారంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒకే వేదికపై 70కి పైగా ప్రముఖ కంపెనీలు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు.

*జాబ్ మేళా వివరాలు:*
– *తేదీ:* సెప్టెంబర్ 19, 2026 (శనివారం)
– *సమయం:* ఉదయం 8:00 గం. నుండి మధ్యాహ్నం 1:00 గం. వరకు
– *వేదిక:* వి.వి.ఆర్ గార్డెన్స్, లక్కారం, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా.
*విద్యార్హత:* 10 వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ – ఏదైనా విద్యార్హత కలిగిన వారు అర్హులని చైర్మన్ భాస్కర్ తెలిపారు. అభ్యర్థులు తమ రెజ్యూమె, విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావాలని, ఇది పూర్తిగా ఉచితమని, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.