పలాస నియోజక వర్గంలో స్తానిక ఎన్నికలకు ముందే అదికార పార్టీ గెలుపు కోసము కొత్త ఎత్తులు?
రానున్న స్తానిక ఎన్నికల్లో వైసిపి పార్టీ నుంచి. పోటీ చేసే అభ్యర్థుల్లో ఆశలు , భయాలు తో పోటీ కు రాకుండా ముందుస్తు చర్యలు
వరసలు కట్టి ఎందుకు బావా పోటీ..మీకు అవసర మైనా సహాయము తాము అందిస్తాము
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు స్తానిక ఎన్నికల్లో పోటీ చేసే వారికి పోటీకి దూరంగా ఉండాలన్న ప్రయత్నం చేస్తున్నారు..
పలాస ,ప్రజావాణి ప్రతినిధి
రాష్ట్రంలోనే అత్యంత చైతన్యవంతమైన పలాస నియోజక వర్గంలో రానున్న స్తానిక ఎన్నికల్లో కూటమి సర్కారు అధికారము కోసము కొత్త
వ్యూహంలో ముందుకు వెళుతున్నారని ఇక్కడ రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పలాస నియోజక వర్గంలో స్తానిక సంస్థల్లో పోటీకి అభ్యర్ధులను ఎవరు అని తెలుసుకొని అధికార పార్టీ సరికొత్త ప్రయత్నాలతో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నాను.
పలాస నియోజకవర్గంలో మెజారిటీ సర్పంచలు అలాగే ఎంపీటీసీలు ఎంపిపి లు , జెడ్పీటీసీ కూడా వైసిపి పార్టీ కు చెందిన వారే అనీ చెప్పక తప్పదు. కూటమి సర్కార్ పాలన రెండేళ్ళ దాటుతున్నా వైసిపి పార్టీ నుంచి కూటమి సర్కారు వైపు ఎవరిని దారి మళ్లించే లేక పోయారనీ చెప్పాక తప్పదు. అయితే ఇక్కడ పలాస నియోజకవర్గం లో మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు కోటరీ బీటలు వారలేదని ఇక్కడ రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పలాస నియోజక వర్గం విస్తృత స్థాయి సమావేశము
జరిగింది
డాక్టర్ అప్పలరాజు అభిమానము చెక్కు చెదర లేదా
ఈ సమావేశానికి వజ్రపు కొత్తూరు మండలం మందస మండలం అలాగే పలాస రూల్ తొ పాటు మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున అప్పలరాజు అభిమానులు , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కు చెందిన ప్రధాన నాయకులూ పాల్గొన్నారు.
జిల్లా పార్ట్ నేతలు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన ప్రసాదరావు అలాగే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అలాగే సీనియర్ వైసీపీ నేత ధర్మాన కృష్ణా దాస్లు పాల్గొని
మాజి మంత్రి డాక్టర్ అప్పలరాజు గెలుపు కోసము తామంతా సహకారము చేస్తామని అప్పలరాజు మనోధైర్యాన్ని ఇచ్చారు..
అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపు కత్తి మీద సాము ల ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

