📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamపందిళ్ళపల్లి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం

పందిళ్ళపల్లి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం

📰 Generate e-Paper Clip

పందిళ్ళపల్లి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం

**అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జోనల్ ఇంచార్జ్ ఇనుకుళ్ళ నాగ సురారెడ్డి

**1,60,000 రూపాయలతో ఏర్పాటుచేసిన అలవాల కొండయ్య- పుష్ప దంపతులు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పందిళ్ళపల్లి పాత బొడ్రాయి సెంటర్లోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అలవాల కొండయ్య- పుష్ప దంపతులు కుమారుడు అలవాల గోపీనాథ్ 1,60,000 రూపాయలు అన్నదాన కార్యక్రమానికి వితరణగా అందజేశారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇనుకుళ్ళ నాగసురారెడ్డి మాట్లాడుతూ భక్తిశ్రద్ధలు, క్రమశిక్షణగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పాత బొడ్రాయి సెంటర్ యూత్ ను అభినందించారు. అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో విలువైనదని కొనియాడారు. తన సొంత డబ్బుతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయించిన అలవాల కొండయ్య- పుష్ప దంపతులు కుమారుడు గోపీనాథ్ అందించారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాకులు తగిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.. స్థానిక పోలీస్ నియమ నిబంధనల లోబడి నిమజ్జనా కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు అలవాల జనార్దన్ రావు, చల్లా బద్రారెడ్డి, మధిర శ్రీనివాస్ రెడ్డి, మందటి నరేష్, ఇనుకుల్ల బ్రహ్మ రెడ్డి,లింగం రాంబాబు, కొండపరెడ్డి రవీందర్ రెడ్డి, వార్డు మెంబర్ మండే రామలింగయ్య, మండే శ్రీనివాసరావు, కొమ్మినేని నాగేశ్వరరావు, దారగాని రామారావు, అలవాల వెంకట నరసయ్య, లింగం రంగారావు, రేకం వెంకటేశ్వర్లు,మండే చంద్రయ్య,యడ్ల భద్రయ్య, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరీదు వంశీకృష్ణ, ఉత్సవ కమిటీ యూత్ సభ్యులు రేఖం హరీష్, మండే ఉదయ్ కిరణ్ మండే సతీష్, వత్సవాయి కోటి, వత్సవాయి కిరణ్, వత్సవాయి అనిల్,రేఖం నరేందర్, మండే వేణు, అలవాల ఉదయ్ నవీన్, అలవాల జయంత్, అలవాల విగ్నేష్, బాల గోపి, అలవాల అవినాష్, సతీష్ బాల సతీష్ బాల సాయి నిఖిల్, మండే కోటి రామేశ్వరరావు, వత్సవాయి కోటేశ్వరరావు, వినాయక విగ్రహ దాత గోనె గోపి – రాజ్ భార్గవి దంపతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.