📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరోడ్డుపై మార్కెట్‌ నిర్వహణ కోసం వ్యాపారుల ధర్నా

రోడ్డుపై మార్కెట్‌ నిర్వహణ కోసం వ్యాపారుల ధర్నా

📰 Generate e-Paper Clip

*రోడ్డుపై మార్కెట్‌ నిర్వహణ కోసం వ్యాపారుల ధర్నా*

*తాత్కాలికంగా అనుమతి ఇచ్చిన సిఎంసి అధికారులు*

అమీన్పూర్‌, సెప్టెంబర్‌ 20 (ప్రజావాణి):అమీన్పూర్‌ ప్రధాన రహదారిపై కూరగాయల మార్కెట్‌ నిర్వహించుకునేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక వ్యాపారులు గాంధీ బొమ్మ వద్ద ధర్నాకు దిగారు. అధికారులు కేటాయించిన ప్రాంతంలో మార్కెట్‌ నిర్వహిస్తే ప్రజలు రావడం లేదని, దీంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ప్రధాన రహదారిపై మార్కెట్‌ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని సిఎంసి అధికారులు తెలిపారు. మార్కెట్‌ కోసం అధికారులు నిర్ణయించిన ప్రాంతాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనిపై వ్యాపారులు స్పందిస్తూ.. అధికారులు సూచించిన ప్రాంతాల పక్కనే స్మశాన వాటిక ఉండటంతో ప్రజలు మార్కెట్‌కు రావడం లేదని తెలిపారు. అక్కడ వ్యాపారం సాగకపోవడంతో కుటుంబాల పోషణ భారంగా మారుతోందని వాపోయారు.
ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా కేటాయించి మార్కెట్‌ నిర్వహణకు అవకాశం కల్పించాలని సిఎంసి అధికారులను కోరారు. అమీన్పూర్‌ సీఐ ప్రవీణ్‌రెడ్డి అక్కడికి చేరుకుని వ్యాపారులతో చర్చించారు. వ్యాపారులు, అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం.. మార్కెట్‌కు అవసరమైన మౌలిక వసతులు కల్పించేంత వరకు ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా రోడ్డుపై మార్కెట్‌ నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు సిఎంసి అధికారులు తెలిపారు.
మార్కెట్‌కు శాశ్వతంగా అనుకూలమైన ప్రాంతాన్ని గుర్తించి మౌలిక వసతులు కల్పించాలని వ్యాపారులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.