సీతారాంపూర్ ఎస్సీ కాలనీలో గణనాథుని లడ్డూ వేలం
తొలి లడ్డూ రూ.56 వేలకే సొంతం
రంగారెడ్డి జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 25, ప్రజావాణి:
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో కొలువుదీరిన గణనాథుడికి నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో గణనాథుని తొలి లడ్డూను రూ.56,000లకు మనీ చించెట్టి కైవసం చేసుకున్నారు. చిన్న లడ్డూను జీపీ ఎఫ్ఏ ఎల్లారపల్లి నర్సింలు రూ.22,100లకు దక్కించుకున్నారు. స్వామివారి ఫలాల వేలంలో డప్పు దర్శన్ రూ.6,500లకు కైవసం చేసుకున్నారు.
వేలంపాట కార్యక్రమంలో సీతారాంపూర్ గ్రామ సర్పంచ్ తోపుకొండ పావని చెన్నయ్య, డాక్టర్ రాజు, బి. సత్తయ్య, చించెట్టి రవీందర్, తోపుకొండ నర్సింలు, గోవుల యాదయ్య, మాల బుగ్గ రాములు, గోవుల కృష్ణ, కే. సందీప్ తదితరులు పాల్గొన్నారు.
గణనాథుని నిమజ్జనంతో పాటు నిర్వహించిన వేలంపాటలో గ్రామ మహిళలు, చిన్నారులు, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



