*దివ్యాంగుల సేవకు గుర్తింపు.. నాగరాజుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం*
*దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సంక్షేమానికి విశేష సేవలు*
మేడ్చల్ కీసర, సెప్టెంబర్ 21
మేడ్చల్ జిల్లా : వివిధ రంగాల్లో సామాజిక సేవలు అందిస్తున్న వారిని గుర్తించి మంగళవారం మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ ప్రోత్సాహక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వయోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికుల పింఛన్ల పెంపు, దివ్యాంగుల సంక్షేమం కోసం విశేష సేవలు అందిస్తున్న వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కనకబోయిన నాగరాజు ముదిరాజ్‌కు ‘తెలంగాణ అమరవీరుల మహా త్యాగ సమృద్ధి పురస్కారం–2026’ అందజేశారు.దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందించడంతోపాటు వారి జీవనోపాధికి సహకరిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ పురస్కారం అందుకున్నట్లు నాగరాజు తెలిపారు. తన సేవలను గుర్తించి సత్కరించిన మనం ఫౌండేషన్ జాతీయస్థాయి చైర్మన్ డాక్టర్ కె. చక్రవర్తి, రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్, కన్వీనర్ బండ జగన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

