📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*గౌడవల్లిలో ఘనంగా డాక్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం*

*గౌడవల్లిలో ఘనంగా డాక్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం*

📰 Generate e-Paper Clip

*ప్రభుత్వ సేవలు ఇంటి వద్దకే*

*గౌడవల్లిలో ఘనంగా డాక్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం*

మేడ్చల్: గ్రామీణ ప్రజలకు తపాలా, బీమా, బ్యాంకింగ్ తదితర సేవలను మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే అందించాలనే లక్ష్యంతో భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం “ఇండియా పోస్ట్: బ్రింగ్ గవర్నమెంట్ టు యువర్ డోర్‌స్టెప్” కార్యక్రమాన్ని సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవల్లి వార్డు కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. భారత తపాలా శాఖ మేడ్చల్ సబ్ పోస్ట్‌మాస్టర్ సౌజన్య, గౌడవల్లి పోస్ట్‌మాస్టర్ బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గౌడవల్లి మాజీ సర్పంచ్, గుండ్లపోచంపల్లి డివిజన్ ప్రెసిడెంట్ గరిసెల సురేందర్ ముదిరాజ్, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా తపాలా శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సంపత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలోని వృద్ధులు, మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తపాలా శాఖ అందిస్తున్న వివిధ సేవలపై అవగాహన పొందారు.

*ఇంటి వద్దకే పోస్టల్ సేవలు*

డిసిడిపి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తపాలా శాఖ అందిస్తున్న సేవలను నేరుగా చేరువ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ సేవలతో పాటు బీమా, పొదుపు, బ్యాంకింగ్ వంటి వివిధ సేవల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా పొదుపు పథకాలు, బీమా సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా అందించడంతో పాటు తపాలా శాఖపై మరింత అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తపాలా శాఖకు ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ప్రజలకు అవసరమైన సేవలను మరింత చేరువ చేస్తున్నామని వివరించారు.

*పిఎల్ఐతో కుటుంబానికి ఆర్థిక భరోసా*

కార్యక్రమంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పిఎల్ ఐ పథకంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. తక్కువ ప్రీమియంతో బీమా రక్షణ పొందే అవకాశం, ప్రభుత్వ ఆధారిత విశ్వసనీయ బీమా పథకం, బోనస్ ప్రయోజనాలు, కుటుంబానికి ఆర్థిక భద్రత వంటి అంశాలను వివరించారు.

చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారా భవిష్యత్ అవసరాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవచ్చని అధికారులు తెలిపారు. పిల్లల విద్య, వివాహం, కుటుంబ భవిష్యత్ అవసరాలు వంటి లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ప్రజలు పిలైఐ తో పాటు తపాలా శాఖ అందిస్తున్న ఇతర పొదుపు, బీమా పథకాల వివరాలను తెలుసుకుని ప్రయోజనం పొందాలని కోరారు.

*సేవలను సద్వినియోగం చేసుకోవాలి: సురేందర్ ముదిరాజ్*

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, డివిజన్ ప్రెసిడెంట్ గరిసెల సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిసిడిపి కార్యక్రమం ద్వారా పోస్టల్ సేవలు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రజలకు మరింత చేరువ అవుతున్నాయని అన్నారు.

ప్రజలు తమకు అందుబాటులోకి వచ్చిన ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకురావడం వల్ల ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలో తపాలా శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

*ప్రజల్లో ఆసక్తి*

కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు తపాలా శాఖ అందిస్తున్న బీమా, పొదుపు, బ్యాంకింగ్ తదితర సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులకు అందుబాటులో ఉన్న పథకాలు, వాటి ప్రయోజనాలు, అర్హతలు, సేవలను పొందే విధానం తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో తపాలా శాఖ అధికారులు, స్థానిక నాయకులు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్‌లో కూడా నిర్వహించాలని స్థానికులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.