*ఇంగే కొమురయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు*
*జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (ప్రజావాణి):*
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి & ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు…
జిల్లాలోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన కీ.శే. ఇంగే కొమురయ్య గారు అనారోగ్యంతో శనివారం పరమపదించగా, స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం వారి మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

