పోరుమామిళ్ల,సెప్టెంబర్ 15 ప్రజావాణి వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లలోని కడప–విజయవాడ ప్రధాన రహదారిపై కాలువకట్ట సమీపంలో రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు,స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రోడ్డుపై గుంతలను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయపడిన ఘటనలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. వాహనాల రాకపోకలతో దుమ్ము,ధూళి ఎగసిపడటంతో రోడ్డుపక్కన నివసించే ప్రజలు,వ్యాపారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవలే మరమ్మతులు చేసిన రోడ్డు ఏడాది కూడా గడవకముందే గుంతలమయంగా మారడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు స్పందిస్తూ. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్‌కు ఫిర్యాదు చేస్తామని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సెక్రటరీ ఫణి రావు, ఆఫీస్ సెక్రటరీ ప్రవీణ్, కిసాన్ మోక్ష జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
గుంతలమయమైన ప్రధాన రహదారి వెంటనే మరమ్మతులు చేయాలని హ్యూమన్ రైట్స్ డిమాండ్
RELATED ARTICLES
