ఏబీవీపీ మెదక్ జిల్లా కన్వీనర్‌గా బండారి ప్రశాంత్
నిజాంపేట, సెప్టెంబర్ 7 (ప్రజావాణి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ నెల 5, 6 తేదీల్లో ఖమ్మం జిల్లాలో నిర్వహించారు. ఈ సమావేశాల్లో నిజాంపేట మండలానికి చెందిన బండారి ప్రశాంత్‌ను ఏబీవీపీ మెదక్ జిల్లా కన్వీనర్‌గా రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ నియమించారు.
ఈ సందర్భంగా బండారి ప్రశాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మెదక్ జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తానన్నారు. విద్యార్థుల హక్కులు, విద్యా సమస్యలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ముందుండి పోరాడుతానని తెలిపారు.
విద్యార్థుల సంక్షేమంతో పాటు జాతీయ పునర్నిర్మాణం కోసం ఏబీవీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానని బండారి ప్రశాంత్ పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ జిల్లాలో ఏబీవీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఏబీవీపీ మెదక్ జిల్లా కన్వీనర్‌గా బండారి ప్రశాంత్
RELATED ARTICLES

