*22 ఏ నిషేధిత జాబితాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ధర్నా*
*పొలిట్ బ్యూరో సభ్యులు నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్*
మేడ్చల్, సెప్టెంబర్
(ప్రజా వాణి):
22 ఏ నిషేధిత జాబితాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. ప్రైవేట్ ఆస్తులను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తాము పోరాడుతామని వారు స్పష్టం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి మెమోరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, ఎం అరవింద్ కుమార్ గౌడ్, మల్కాజిగిరి పార్లమెంటరీ అధ్యక్షుడు కందికంటి అశోక్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి సుంకర వెంకటేష్, ఇతర నాయకులు కరణం గోపి, చంద్రశేఖర్, రామకృష్ణ, తెలుగు యువత జనరల్ సెక్రటరీ నరేష్ ముదిరాజ్, జవహర్ నగర్ అధ్యక్షుడు నామాల సురేష్, వెంకటరమణ, దమ్మైగూడ అధ్యక్షుడు కృష్ణారావు, నాగారం అధ్యక్షుడు కొండ జంగారెడ్డి, నాగరాజు, తండాలపల్లి శంకర్, రాములు యాదవ్, ఉమా శంకర్ గౌడ్, కోటేశ్వరరావు, ఆశా బిందు తదిత రులు పాల్గొన్నారు.

