📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఫేక్ అధికారి.. ట్రేడ్ లైసెన్స్ పేరుతో వసూళ్లు!

ఫేక్ అధికారి.. ట్రేడ్ లైసెన్స్ పేరుతో వసూళ్లు!

📰 Generate e-Paper Clip

ఫేక్ అధికారి.. ట్రేడ్ లైసెన్స్ పేరుతో వసూళ్లు!

నకిలీ ఐడీ కార్డుతో దుకాణాలు, హోటళ్లే టార్గెట్‌.. స్థానికుల అప్రమత్తతతో గుట్టురట్టు

మేడ్చల్, సెప్టెంబర్ 16 (ప్రజా వాణి)
తాను లేబర్ ఆఫీసర్‌నంటూ నకిలీ గుర్తింపు కార్డుతో దుకాణాలు, హోటళ్ల నుంచి ట్రేడ్ లైసెన్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తి వ్యవహారం మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో వెలుగులోకి వచ్చింది. స్థానికుల అనుమానంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో నకిలీ అధికారి గుట్టురట్టయింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్‌లో ఓ వ్యక్తి తాను లేబర్ ఆఫీసర్‌నని పరిచయం చేసుకుంటూ దుకాణాలు, హోటళ్ల వద్దకు వెళ్లాడు. ట్రేడ్ లైసెన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి మాటతీరు, వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన స్థానికులు ఐడీ కార్డు చూపించాలని నిలదీశారు. అతడు చూపించిన గుర్తింపు కార్డును పరిశీలించగా అది నకిలీదిగా గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

గతంలోనూ ఇదే తరహా ఘటన

మేడ్చల్‌లో గతంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. తాను జోనల్ కమిషనర్‌నంటూ ఓ వ్యక్తి కేఎల్‌ఆర్‌ వెంచర్‌లో డబ్బులు వసూలు చేస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో డబ్బుల కోసం నకిలీ అధికారిగా అవతారమెత్తినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నకిలీ అధికారులు, వసూళ్లకు పాల్పడే వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా తాము ప్రభుత్వ అధికారి అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే వారి గుర్తింపు కార్డును పరిశీలించాలని, అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. నకిలీ అధికారుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించవద్దని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.