నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
దీర్ఘకాలంగా అసంపూర్తిగా ఉన్న శివన్నగూడెం ప్రాజెక్టును తక్షణమే పూర్తిచేసేలా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈఎల్వీ భాస్కర్ పేర్కొన్నారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుతో పాటు రాచకొండ ఎత్తిపోతల పథకంపై గళమెత్తాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు ఓ వినతిపత్రం అందించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తయితేనే స్థానిక రైతుల సాగునీటి కష్టాలు తీరని భాస్కర్ ఈ సందర్భంగా వివరించారు. రైతుల పక్షాన పోరాడాలన్న ఆయన విజ్ఞప్తిపై హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారు.

