జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు జగన్ ఇటీవల మృతిచెందారు. మంగళవారం కొడిమ్యాల మండల ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘ నాయకులు గుల్లకోట గ్రామానికి చేరుకుని జగన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులుర్పించారు. గ్రామ సర్పంచ్ గొల్లపల్లి మల్లేష్ గౌడ్‌తో కలిసి మృతుని కుటుంబసభ్యులను పరామర్శించి, సంఘం తరఫున రూ. 16వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామిడి సతీష్ రెడ్డి, నాయకులు సుదర్శన్, రాజేందర్ రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి ఆర్‌ఎంపీ సంఘం ఆర్థిక
RELATED ARTICLES

