- ఉమ్మడి మండలాల విజ్ఞాన్ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ నూతన కమిటీఎన్నిక.

కోటగిరి/ప్రజావాణి:-కోటగిరి,పోతంగల్ మండలాల విజ్ఞాన్ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ వారు ఆదివారం కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో తమ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.ఈ ఎన్నికలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా గైని గజానంద్ ఉపాధ్యక్షులుగా ఎం.ఏ. సమీర్,కోశాధికారిగా గైని శంకర్,ప్రధాన కార్యదర్శిగా వడ్డే నర్సింలు,సహాయ కార్యదర్శిగా సింహాద్రి,గౌరవ అధ్యక్షులు గా ఎన్ శ్రీనివాసరావు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు గైని గజానంద్ మాట్లాడుతూ.విజ్ఞాన్ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ తరఫునుండి తనను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.ఇక నుండి అసోసియేషన్కు కట్టుబడి ఉంటూ అభివృద్ధి పాటు పడతానని ఆయన వివరించారు. అసోసియేన్ కొరకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అందరి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

