📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జూడా విభాగం. స్టైపెండ్ 30% పెంపు కోసం కొనసాగుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మె –...

జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జూడా విభాగం. స్టైపెండ్ 30% పెంపు కోసం కొనసాగుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మె – ఎస్వీఎంసీ వైద్యుల 8వ రోజు నిరసన శంఖారావం

📰 Generate e-Paper Clip

తిరుపతి ఆగస్టు 18 ప్రజావాణి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ  తిరుపతి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.2026 జనవరి 1వ తేదీ నుండి పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ (ఉపకార వేతనం) సవరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,ఎస్వీ మెడికల్ కాలేజీ ఆవరణలో జూనియర్ డాక్టర్లు,హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు మరియు సీనియర్ రెసిడెంట్లు చేపట్టిన నిరసన కార్యక్రమాలు నేటితో 8వ రోజుకు చేరుకున్నాయి.తొలి రోజుల్లో రోగులకు ఇబ్బంది కలగకుండా కేవలం విధులను బహిష్కరించి శాంతియుతంగా నిరసన తెలిపినప్పటికీ, వైద్య ఆరోగ్య శాఖా అధికారులు మరియు ప్రభుత్వం నుండి ఎటువంటి రాతపూర్వకమైన హామీ లభించలేదు.ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో,తప్పనిసరి పరిస్థితుల్లో నిన్నటి నుండి అత్యవసర సేవలను సైతం నిలిపివేసి రెండవ రోజు కూడా నిరసనను కొనసాగిస్తున్నాము.ప్రధాన డిమాండ్లు ఇవే:30% స్టైపెండ్ పెంపు: ప్రతి రెండేళ్లకు ఒకసారి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా 15% స్టైపెండ్‌ పెంచాలనే నిబంధన (G.O. 287) ఉన్నప్పటికీ,గత ఏడు నెలలుగా ఈ సవరణ నిలిచిపోయింది.పనిభారం మరియు జీవన వ్యయాలు పెరిగినందున,ప్రస్తుతం 30% స్టైపెండ్‌ను పెంచాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ వయస్సు పెంపు ప్రతిపాదన ఉపసంహరణ: సీనియర్ డాక్టర్ల పదవీ విరమణ వయస్సును 62 నుండి 65 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి. దీనివల్ల యువ వైద్యుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి.అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో నేషనల్ మెడికల్ కమిషన్  నిబంధనలను కచ్చితంగా పాటించాలి.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తీవ్ర వ్యత్యాసం పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు మరియు కేరళతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు ఇస్తున్న స్టైపెండ్ చాలా తక్కువగా ఉంది. పెరిగిన అవుట్‌పేషెంట్ (OP) సమయాలు, అదనపు పని గంటలు మరియు ఆసుపత్రి రికార్డుల డిజిటలైజేషన్ వంటి అదనపు బాధ్యతలు మోస్తున్నప్పటికీ, తగిన వేతనం లభించకపోవడం అన్యాయమని జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“వైద్యుల సేవలకు గౌరవం– మా స్టైపెండ్‌కు 30% పెంపు” అనే నినాదంతో మా హక్కుల సాధన కోసం ఈ పోరాటాన్ని సాగిస్తున్నాము. ప్రజలకు,రోగులకు జరుగుతున్న ఇబ్బందులకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మొండివైఖరి వీడి,మా న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు రాతపూర్వకమైన స్పష్టమైన హామీ లభించే వరకు ఈ సమ్మె ఆగేది లేదు.జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్రతరం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ సేవలతో పాటు అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలుగుతోంది. రోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకోవాల్సిందిగా లేదా సీనియర్ డాక్టర్లు అందుబాటులో ఉన్న విభాగాలను సంప్రదించాల్సిందిగా కోరడమైనది.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.