జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జూడా విభాగం. స్టైపెండ్ 30% పెంపు కోసం కొనసాగుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మె – ఎస్వీఎంసీ వైద్యుల 8వ రోజు నిరసన శంఖారావం

తిరుపతి ఆగస్టు 18 ప్రజావాణి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ  తిరుపతి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.2026 జనవరి 1వ తేదీ నుండి పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ (ఉపకార వేతనం) సవరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,ఎస్వీ మెడికల్ కాలేజీ ఆవరణలో జూనియర్ డాక్టర్లు,హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు మరియు సీనియర్ రెసిడెంట్లు చేపట్టిన నిరసన కార్యక్రమాలు నేటితో 8వ రోజుకు చేరుకున్నాయి.తొలి రోజుల్లో రోగులకు ఇబ్బంది కలగకుండా కేవలం విధులను...