📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల రెండవ మండల విద్యాశాఖాధికారి గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన తూటుపల్లి.శివకుమార్

పోరుమామిళ్ల రెండవ మండల విద్యాశాఖాధికారి గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన తూటుపల్లి.శివకుమార్

📰 Generate e-Paper Clip

సమర్థతకు లభించిన సముచిత స్థానం.. నిరంతర విద్యా సేవకు దక్కిన గౌరవం.”

వైఎస్ఆర్ కడప జిల్లా:సెప్టెంబర్ 17ప్రజావాణి పోరుమామిళ్ల మండల విద్యా రంగంలో ఒక ఆదర్శవంతమైన అధికారి నేతృత్వంలో సరికొత్త ప్రస్థానం ప్రారంభమైంది. పోరుమామిళ్ల మండలం కె.ఎస్.ఆర్.ఎం.జెడ్పీహెచ్ఎస్ (కవలకుంట్ల) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) గా సేవలందిస్తున్న శ్రీ తూటుపల్లి.శివకుమార్,ఇప్పుడు పోరుమామిళ్ల రెండవ మండల విద్యాశాఖాధికారి,గా ఫుల్ అడిషనల్ చార్జ్ (పూర్తి అదనపు బాధ్యతలు) స్వీకరించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన ఈ అత్యున్నత బాధ్యతలను అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించి,విధుల్లో చేరారు.
అభినందనల వెల్లువ..
తన సుదీర్ఘ విద్యా బోధన మరియు పరిపాలనా ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన శ్రీ.తూటుపల్లి శివకుమార్,ఇప్పుడు మండల స్థాయి విద్యా పరిపాలన బాధ్యతలను చేపట్టడం పట్ల ఉపాధ్యాయ లోకంతో పాటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎంఈఓ శివకుమార్ ని మండలంలోని.ఈ కార్యక్రమం పోరుమామిళ్ల నందు ఉపాధ్యాయ బృందం,పోరుమామిళ్ల ఎంఈఓ1 M.ఓబులేసు, కాశినాయన ఎంఈఓ,షఫీ, B.కోడూరు ఎంఈఓ G.రాజశేఖరరెడ్డి,ఆధ్వర్యం లో ఘనంగా సన్మానించడము జరిగింది.శివకుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటానని చెప్పడం జరిగింది.పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యా సంఘాల నాయకులు మరియు కార్యాలయ సిబ్బంది కలిసి ఘనంగా పుష్పగుచ్ఛాలు అందించి,శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం:ఎంఈఓ,తూటుపల్లి. శివకుమార్“పాఠశాలల సర్వాంగీణ అభివృద్ధి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే నా ప్రథమ కర్తవ్యం.“ఈ సందర్భంగా నూతన ఎంఈఓ శ్రీ తూటుపల్లి. శివకుమార్ మాట్లాడుతూ.తనపై నమ్మకంతో ఈ గురుతర బాధ్యతలను అప్పగించిన విద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కవలకుంట్ల జెడ్పీహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా తన విధులను నిర్వర్తిస్తూనే,పోరుమామిళ్ల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన,ఉపాధ్యాయుల సమయపాలన, రాబోయే పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతామని ఆయన వివరించారు.
సమర్థ నాయకత్వంలో ప్రగతి పథం వైపు..
కవలకుంట్ల స్కూల్ హెడ్మాస్టర్‌గా శ్రీ తూటుపల్లి.శివకుమార్,చూపిన నిబద్ధత,క్రమశిక్షణ,పాఠశాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఇప్పుడు పోరుమామిళ్ల మండలానికే ఆదర్శంగా నిలవనున్నాయి.ఒక అనుభవజ్ఞుడైన,నిష్కలంక చరిత్ర కలిగిన అధికారి చేతుల్లోకి మండల విద్యాశాఖ బాధ్యతలు వెళ్లడంతో, రాబోయే రోజుల్లో పోరుమామిళ్ల మండల విద్యా వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కుతుందని,విద్యా రంగంలో మండలం ముందంజలో నిలుస్తుందని స్థానిక విద్యా ప్రముఖులు మరియు మేధావులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.