📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్లలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు: భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన ప్రముఖులు

పోరుమామిళ్లలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు: భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన ప్రముఖులు

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల:సెప్టెంబర్ 17ప్రజావాణి పట్టణంలో విశ్వకర్మ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో,అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో వెలసిన విశ్వకర్మ భగవానుని విగ్రహానికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు,హోమాలు,అభిషేకాలు జరిపారు.నూతన వస్త్రాలంకరణతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ వేడుకల్లో బద్వేల్ ఏఎంసీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మన సుబ్బరాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.సృష్టికర్త అయిన విశ్వకర్మ భగవానుని జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.సమాజ నిర్మాణంలో,వివిధ వృత్తుల ద్వారా దేశ ప్రగతికి విశ్వబ్రాహ్మణులు చేస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు.కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నారోజు రమణ చారి,అసెంబ్లీ కో-కన్వీనర్ పల్లం శెట్టి పండారి,కిసాన్ మోర్చా నాయకులు తమ్మిశెట్టి రమణ,ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు చెన్నయ్య, బ్రహ్మయ్య,రామస్వామి,ఈశ్వరమ్మ తదితరులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.ఆలయ చైర్మన్ బాల నరసింహ చారి ఆధ్వర్యంలో వచ్చిన అతిథులను,ప్రముఖులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.స్వామివారి శేషవస్త్రాలు,తీర్థప్రసాదాలను అందజేశారు.దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని,దేశం మరింతగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా దేవుడిని ప్రార్థించినట్లు ఆలయ చైర్మన్ తెలిపారు.ఈ వేడుకల్లో స్థానిక భక్తులు, విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.