📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్చండూరు లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో మొక్కలు నాటుతున్న డి ఎస్ ఆర్...

చండూరు లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో మొక్కలు నాటుతున్న డి ఎస్ ఆర్ ఫౌండేషన్

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):

చండూరులోని శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సుధాకర్ ఫౌండేషన్ (డీఎస్‌ఆర్) గ్రూప్స్ ఆధ్వర్యంలో కల్పతరువు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా చండూరు మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల 80 మొక్కలను నాటించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీ ఆర్ ఎస్ చండూరు మండల పార్టీ బొమ్మరబోయిన వెంకన్న మొక్కలు నాటి, మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను మర్చిపోకుండా వాటిని సంరక్షించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో అనేక మార్పులు వచ్చి వర్షాలు పడకుండా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి ఇబ్బందుల నుండి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే అది కేవలం చెట్ల ద్వారానే సాధ్యమవుతుందని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఎస్‌ఆర్ కంపెనీ ప్రతినిధులు ఏఎస్‌ఎం జలంధర్, ఎస్‌ఓ అబ్బరబోయిన రవి, డీలర్లు సోమ శ్రీను, గంట శ్రీనివాస్, సంగేపు మల్లికార్జున్, పత్రికా విలేకరులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.