చండూరు లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో మొక్కలు నాటుతున్న డి ఎస్ ఆర్ ఫౌండేషన్

నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి): చండూరులోని శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సుధాకర్ ఫౌండేషన్ (డీఎస్‌ఆర్) గ్రూప్స్ ఆధ్వర్యంలో కల్పతరువు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా చండూరు మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల 80 మొక్కలను నాటించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీ ఆర్ ఎస్ చండూరు మండల పార్టీ బొమ్మరబోయిన వెంకన్న మొక్కలు నాటి, మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో...