పోచారం, ఆగస్టు 20 (ప్రజా వాణి): భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాచవాని సింగారం, ప్రతాప సింగారం, నారపల్లి, అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటుకల కృష్ణారెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని ఆధునికత వైపు నడిపించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
యువతకు సాంకేతిక రంగంలో విస్తృత అవకాశాలు కల్పించడంతో పాటు సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు రాజీవ్ గాంధీ పునాదులు వేశారని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, ఆధునికీకరణపై ఆయనకు ఉన్న దూరదృష్టి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలు, ఆదర్శాలు, దేశసేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవి రాజు, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కొంతం శంకర్ రెడ్డి, గణేశ్ యాదవ్, బద్దం మల్లికార్జున్ రెడ్డి, సహదేవ్ గౌడ్, శాంతి కుమార్, శ్రీకాంత్, బద్రి, విజయ్, ఎండి నవాబ్, సయ్యద్ జాఫర్, ఎండి నవాజ్, షబ్బీర్, నిజాంఖాన్, మోటుపల్లి వెంకటేష్, ఫరీద్, ఉమర్, రఫిక్, సంతోష్, కాచవాని సింగారం అధ్యక్షులు వర్కల మహేష్ గౌడ్, ప్రతాప సింగారం అధ్యక్షులు సురేష్, చౌదరిగూడ అధ్యక్షులు మంచాల సుధాకర్, వెంకటాపురం అధ్యక్షులు వెంకటేష్, రాజీవ్ గృహకల్ప అధ్యక్షులు జి. రమేష్, బాలాజీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ నీరుడి కుమార్, భోజి రెడ్డి, నర్సింగ్ ముదిరాజ్, భాస్కర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బద్దం కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోత్ శ్రవణ్ నాయక్, బండ్లగూడ నాగేష్ గౌడ్, సి.హెచ్. కృష్ణ, ప్రభాకర్ గౌడ్, కర్రె అశోక్, నాగులపల్లి శ్రీనివాస్, సిద్ధగోని నర్సింహ, సందీప్ రెడ్డి, భాస్కర్ గౌడ్, వంశీ, బైండ్ల జంగయ్య, మహేష్, ఆంజనేయులు గౌడ్, దేవేందర్, అబేదా బేగం, లక్ష్మి, భాగ్య, గౌరీ, పావని తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


