సుందిల్ల గ్రామానికి నూతన వైకుంఠ రథం
-మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో గ్రామస్థులకు సౌకర్యం.
-సుందిల్ల అభివృద్ధిలో మరో ముందడుగు.
-గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి.
రామగిరి,మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 19
రామగిరి మండలం సుందిల్ల గ్రామస్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం,మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో సుందిల్ల గ్రామానికి నూతన వైకుంఠ రథాన్ని అందించింది.గ్రామంలో ఎవరైనా మృతి చెందిన సమయంలో అంతిమయాత్ర నిర్వహించేందుకు ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఇప్పటివరకు అంతిమయాత్రల సమయంలో నడక ద్వారా లేక ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేదని, దీంతో పేద,మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడేదని తెలిపారు.నూతన వైకుంఠ రథం అందుబాటులోకి రావడంతో ఈ ఇబ్బందులు తొలగనున్నాయని అన్నారు.గ్రామస్థుల అవసరాన్ని గుర్తించి వైకుంఠ రథం మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబుకు,శ్రీను బాబు లకు గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్ లకు గ్రామ ప్రజలు,స్థానిక ప్రజా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలకు అందుబాటులో…
వైకుంఠ రథాన్ని గ్రామస్థుల అవసరాల కోసం అందుబాటులో ఉంచనున్నట్లు గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,గ్రామశాఖ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్,గ్రామ కార్యదర్శి రమేష్ లు తెలిపారు.అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులు సంబంధిత గ్రామస్థులను సంప్రదించి వాహన సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రామగిరి మండల కన్వీనర్ పేరాల మహేశ్వర్ రావు,గ్రామ ఉపసర్పంచ్ జనగామ సదానందం,గ్రామ వార్డు సభ్యులు ఈగ శ్రీజ ప్రశాంత్,గర్రెపల్లి చంద్రకళ నరేష్ గౌడ్,విజయగిరి సదాశివ చారి,కొడమళ్లా రవి,దేవాలయ డైరెక్టర్ రేకుంట్ల రవి,రైతు సమన్వయ సమితి కమిటీ సభ్యుడు గడ్డం నాగరాజు,గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు జనగామ కృష్ణస్వామి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం సదానందం,కోర కొప్పుల లక్ష్మణ్,రాములు, రాజయ్య,మారం నారాయణ,దాసరి పృధ్వీ,ఆర్ల సురేష్,ఆర్ల సాయి లు పాల్గొన్నారు.


