వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు వార్డులను సందర్శించిన
* పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట సెప్టెంబర్ 14 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనిప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు వల్ల ఇబ్బందులు ఎదురయ్యే హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రధాన కాలువ శ్రీరామ హాస్పిటల్ నుండి అంబేద్కర్ కాలనీ వైపు వెళ్లేటువంటి ప్రధాన కాలువ రామన్నపల్లి,నాయిని చెరువు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎవరు ప్రజలు ఇంటి నుండి బయటకు రాకూడదని అలాగే వర్షాల కారణంగా ఇళ్లు ఉరుస్తున్నట్టు పాత ఇల్లు ఉండి అందులో ఎవరైనా నివసించినట్లయితే ఏమైనా ఇబ్బందులు ఎదురైనట్లయితే మున్సిపల్ సంబంధిత మున్సిపల్ అధికారులకు తెలుపగలరు అలాగే మేము మా పాలకవర్గం ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పొనగంటి రాముకొలకాని రాజుసానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


