ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…దేశ ఆధునిక ప్రగతికి రాజీవ్ గాంధీ విశేష కృషి : కాంగ్రెస్ నాయకులు
పోచారం, ఆగస్టు 20 (ప్రజా వాణి): భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాచవాని సింగారం, ప్రతాప సింగారం, నారపల్లి, అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటుకల కృష్ణారెడ్డి, పోచారం డివిజన్...