📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarకేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నస్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ రైతాంగంపై తీవ్ర ప్రభావం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నస్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ రైతాంగంపై తీవ్ర ప్రభావం

📰 Generate e-Paper Clip

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నస్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ రైతాంగంపై తీవ్ర ప్రభావం

* పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో-కన్వీనర్ చెల్పూరి రాము

  జమ్మికుంట ఆగస్టు 6 (ప్రజావాణి)

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని గురువారం రోజున జమ్మికుంటలో  పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో-కన్వీనర్ చెల్పూరి రాము ఆందోళన వ్యక్తం చేశారుఒకవైపు ఎల్‌నీనో ప్రభావం మరోవైపు ఎరువులు విత్తనాలు పురుగుమందుల ధరలు పెరగడంతో ఇప్పటికే రైతాంగంపై తీవ్ర ఆర్థిక భారం పడిందని ఆయన అన్నారు. పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరగడంతో రైతులు అయోమయ పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారుఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పత్తి దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రైతులపై మరో పిడుగులా మారనుందని చెల్పూరి రాము విమర్శించారు దిగుమతి సుంకాన్ని తొలగిస్తే విదేశీ పత్తి తక్కువ ధరలకు దేశ మార్కెట్లోకి రావడంతో దేశీయ పత్తి ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారుఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న సాగు ఖర్చులతో సతమతమవుతున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన అన్నారుపత్తి దిగుమతులపై ఉన్న 11 శాతం సుంకాన్ని యథావిధిగా కొనసాగించాలని, రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని, రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని చెల్పూరి రాము డిమాండ్ చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.