📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliతల్లిదండ్రుల ఆవేదనకు స్పందించండి..నా బిడ్డను కాపాడండి  ఆపరేషన్ కు ఆర్థిక సాయం చేయండి

తల్లిదండ్రుల ఆవేదనకు స్పందించండి..
నా బిడ్డను కాపాడండి  ఆపరేషన్ కు ఆర్థిక సాయం చేయండి

📰 Generate e-Paper Clip


మంథని: మంథని మండలం చిల్లపల్లి గ్రామానికి చెందిన అనసూయ, సత్యనారాయణ దంపతుల కుమారుడు చందు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులను సంప్రదించగా, కడుపులోని పేగులు ఒకదానిపై ఒకటి మడతబడినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
ఇప్పటికే ఆపరేషన్ కోసం కుటుంబ సభ్యులు అప్పులు చేసి వైద్యం చేయించారు. అయితే చందుకు మరోసారి ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించడంతో, ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో ఆపరేషన్ చేయించేందుకు అవసరమైన డబ్బులు తమ వద్ద లేకపోవడంతో దాతల సహాయం కోసం వేడుకుంటున్నారు.
“మా బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయం చేయాలి. మీ చిన్న సహాయం మా బిడ్డకు పెద్ద అండగా నిలుస్తుంది” అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.
చందు వైద్య ఖర్చుల కోసం సహాయం చేయదలచిన దాతలు ఫోన్‌పే: 9705578079 నంబర్‌కు తమకు తోచినంత ఆర్థిక సహాయం పంపించి, చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు తోడ్పడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.