📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్చీలాపూర్ లో ఉచిత వైద్య శిబిరం -250 మందికి ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందుల...

చీలాపూర్ లో ఉచిత వైద్య శిబిరం -250 మందికి ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ బెజ్జంకి, జూలై 6 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామంలో భాస్కరచారి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, సన్‌రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యమే తన బాధ్యతగా భావించి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పలువురు ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే తెలుసుకుని అవసరమైన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తాను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత స్వర్గీయ భాస్కరచారి వర్ధంతి సందర్భంగా సురభి హాస్పిటల్, సిద్దిపేట వారి సహకారంతో ఉచిత

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 6 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామంలో భాస్కరచారి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, సన్‌రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరచారి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యమే తన బాధ్యతగా భావించి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పలువురు ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే తెలుసుకుని అవసరమైన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.తాను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత స్వర్గీయ భాస్కరచారి వర్ధంతి సందర్భంగా సురభి హాస్పిటల్, సిద్దిపేట వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని, ఇప్పుడు సన్‌రైజ్ హాస్పిటల్, కరీంనగర్ వారి సౌజన్యంతో మరోసారి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ శిబిరంలో సుమారు 250 మంది గ్రామస్తులు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, అవసరమైన మందులను పొందారు.గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.