📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా కేశవ నారాయణ రెడ్డి సంస్మరణ సభ

ఘనంగా కేశవ నారాయణ రెడ్డి సంస్మరణ సభ

📰 Generate e-Paper Clip

    • ఆయన నిస్వార్థ సేవలు, సౌమ్యత అందరికీ ఆదర్శం: పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాలకొలను నారాయణరెడ్డి
    •  పోరుమామిళ్ల జూలై 06 ప్రజావాణి పెన్షనర్స్ నందు పాలకొలను నారాయణరెడ్డి,పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఆధ్వర్యంలో దివంగత పాలకొలను కేశవ నారాయణ రెడ్డి,సంస్మరణ సభ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.ఈ సంస్మరణ సభలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరెడ్డి  మాట్లాడుతూ.కేశవ నారాయణ రెడ్డి అత్యంత సౌమ్యులని,చాలా మంచి వారని కొనియాడారు.ఆయన మరణం విద్యా రంగానికి,పెన్షనర్ల కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.కేశవ నారాయణ రెడ్డి తన జీవితకాలంలో ఎవరిని కూడా ఎప్పుడూ బాధ పెట్టడం,ఇబ్బంది పెట్టడం గాని చేయలేదని గుర్తుచేసుకున్నారు.ఉపాధ్యాయ వృత్తిలో ఆయన ఎంతో చక్కగా రాణించి,నిస్వార్థంగా సమాజ సేవలో ముందుకు సాగారని ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.కార్యక్రమంలో హాజరైన పలువురు ఉపాధ్యాయులు,రటైర్డ్ ఉద్యోగులు కేశవ నారాయణ రెడ్డి,అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అందరూ నిశ్శబ్ద ప్రార్థన చేశారు.ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గురుమూర్తి,రిటైర్డ్ హిందీ పండిట్ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ హెడ్మాస్టర్ గౌస్ పీర్,కృష్ణయ్య,పాల్గొని ప్రసంగించారు.అలాగే వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు భాస్కర్ రెడ్డి,సుబ్బారెడ్డి,శ్రీనివాసరెడ్డి, బీరం రాంభూపాల్ రెడ్డి రామకృష్ణారెడ్డి,కృష్ణారెడ్డి,రమణారెడ్డి, కుర్ర చెన్నయ్య,పద్మనాభరెడ్డి,భాస్కర్ రెడ్డి,రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.దివంగతుని కుటుంబ సభ్యులు మధుసూదన్ రెడ్డి,కల్లూరు కృష్ణారెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఉపాధ్యాయులు,తోటి ఉపాధ్యాయులు పాల్గొని కేశవ నారాయణ రెడ్డి కి ఘన నివాళులర్పించారు.

Previous article
చీలాపూర్ లో ఉచిత వైద్య శిబిరం -250 మందికి ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ బెజ్జంకి, జూలై 6 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామంలో భాస్కరచారి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, సన్‌రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యమే తన బాధ్యతగా భావించి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పలువురు ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే తెలుసుకుని అవసరమైన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తాను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత స్వర్గీయ భాస్కరచారి వర్ధంతి సందర్భంగా సురభి హాస్పిటల్, సిద్దిపేట వారి సహకారంతో ఉచిత
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.