📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అవినీతికి కేరాఫ్ అడ్డగా మారిన బి కోడూరు తాసిల్దార్ కార్యాలయం

అవినీతికి కేరాఫ్ అడ్డగా మారిన బి కోడూరు తాసిల్దార్ కార్యాలయం

📰 Generate e-Paper Clip

బి కోడూరు జూలై 11 ప్రజావాణి ఫోర్జరీ సంతకాలు చేసే వారిపై సివిల్,క్రిమినల్ కేసులు నమోదు చేయాలి సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ డిమాండ్ ఫోర్జరీ సంతకాలు,దొంగ అగ్రిమెంట్లు,దొంగ పట్టాలు,సృష్టించే వారికి సహకరిస్తున్న కొంతమంది రెవెన్యూ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం కారణాలు ఏమిటి అని,బద్వేలు సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్,పట్టణ కార్యదర్శి బాలు,బి కోడూరు తాసిల్దార్ అధికారుల పై నిజ నిజాలు నెగ్గు తేల్చాలని తెలిపారు శనివారం జేవి భవనం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం లోని ప్రతి మండల కార్యాలయంలో ఫోర్జరీ సంతకాలతో కూడిన దొంగ పట్టాల కు రెవిన్యూ అధికారులు చాప కింద నీరు లాగా వ్యవహరిస్తున్నారని,గతంలో చాలా మందిపై ఆర్డిఓ ఆకుల వెంకటరమణ గారు దొంగ పట్టాల ముద్దాయిలను తేల్చారు.వారిలో కొంతమందిని జైలు కూడా పంపించారు అయినప్పటికీ ఈ దొంగ పట్టాల ముఠా మాఫియా ఏ మాత్రం వెనకడు వేయడం లేదు.నిన్నటి దినం బి కోడూరు మండలంలో ఫోర్జరీ సంతకాలతో దొంగ రిజిస్ట్రేషన్ చేసిన, చేసేందుకు సహకరించిన వారిపై,కఠినమైన చర్యలు తీసుకోవాలని వారన్నారు, గోవింద పల్లె గోవిందాయ పల్లె హై స్కూల్ ను దొంగ రిజిస్టర్ చేసి బ్యాంకును,అధికారులను మోసం చేసిన లక్షల రూపాయలు లోన్ ద్వారా తెచ్చుకొని భాగాలు పంచుకున్న రెవెన్యూ అధికారులపై నామమాత్రం కేసు నమోదు చేసి మమ అన్న రీతిలో పూర్తి చేయడం జరిగింది.అదేవిధంగా బద్వేల్ రూరల్ ప్రాంతంలో వనం పల్లె పంచాయతీ లో చెక్ డాం సైతం చదును చేసి అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్న వారిపై రెవిన్యూ అధికారులకు ఆ భూమి ఎందుకు స్వాధీనం చేసుకోలేకున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితి ఈ విధంగానే ప్రతి మండలంలో పేపర్లో, టీవీల్లో భూ అక్రములపై వంకలు వాగులు, కల్వర్టులు, రస్తాలు ఆక్రమించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడం ఇప్పటికైనా నియోజకవర్గంలో జరుగుతున్న ఫోర్జరీ సంతకాలపై దొంగ పట్టాలపై దొంగ ఆన్లైన్లో పై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి నియంత్రించాలని లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి నాగ దాసరి ఇమ్మానుయేలు కార్యవర్గ సభ్యులు పడిగా వెంకటరమణ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.