📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కలసపాడులో టపాసుల స్టాల్స్ వద్ద భద్రత కరువు! అధికారులు తూతూమంత్రం తనిఖీలు.

కలసపాడులో టపాసుల స్టాల్స్ వద్ద భద్రత కరువు! అధికారులు తూతూమంత్రం తనిఖీలు.

📰 Generate e-Paper Clip

కలసపాడు,నవంబర్ 08 ప్రజావాణి దీపావళి పండుగ వేళ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టపాసుల విక్రయ కేంద్రాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.నిబంధనలను తుంగలో తొక్కి, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న ఈ స్టాళ్లపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎలాంటి అగ్నిమాపక, రక్షణ చర్యలు చేపట్టకుండానే జనావాసాల మధ్య,రద్దీగా ఉండే ప్రాంతాల్లో వ్యాపారాలు సాగిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయినిబంధనలు కాగితాలకే పరిమితం భద్రత శూన్యం!ప్రభుత్వ నిబంధనల ప్రకారం టపాసుల దుకాణాల వద్ద ఖచ్చితంగా అగ్నిమాపక యంత్రాలు (ఫైర్ ఎక్స్‌టింగిషర్స్),నీటి డ్రమ్ములు,ఇసుక బకెట్లను సిద్ధంగా ఉంచాలి. స్టాళ్ల మధ్య తగినంత దూరం పాటించడంతో పాటు విద్యుత్ వైరింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.కానీ,కలసపాడులోని విక్రయ కేంద్రాల వద్ద ఇలాంటి కనీస రక్షణ చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. “ప్రమాదం ఎటు నుండి ముంచుకొస్తుందో” తెలియని స్థితిలో వ్యాపారాలు సాగిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగితే తక్షణమే స్పందించేందుకు ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. బాణసంచా కేంద్రాల్లో చిన్నారుల సంచారం.పట్టించుకోని నిర్వాహకులు!అత్యంత ప్రమాదకరమైన,పేలుడు ధాటికి కారణమయ్యే బాణసంచా విక్రయిస్తున్న ప్రదేశాల్లోనే చిన్నపిల్లలు యథేచ్ఛగా సంచరిస్తున్నా నిర్వాహకులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. స్టాళ్ల సమీపంలో టపాసులు కాలుస్తున్నా,పిల్లలు బాణసంచా గుట్టల మధ్య తిరుగుతున్నా వారించేవారే కరువయ్యారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదం సంభవించి, భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు వణికిపోతున్నారు.ప్రమాదం జరిగి సర్వస్వం కోల్పోయాకే అధికారులు స్పందిస్తారా?ముందే చర్యలు తీసుకోలేరా?” అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

నాసిరకం బాణసంచా.. అధిక ధరలతో జేబులకు చిల్లు!

మరోవైపు, ఈ స్టాళ్లలో నాణ్యతా ప్రమాణాలు లేని నాసిరకం బాణసంచాను విక్రయిస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ,నాసిరకం టపాసులను మార్కెట్లోకి తెచ్చి,వాటిపై ముద్రించిన విపరీతమైన ఎంఆర్‌పీ ధరలకే విక్రయిస్తున్నారు.పండుగ ఉత్సాహంలో ఉన్న ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని,అక్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాసిరకం టపాసుల వల్ల సరిగ్గా పేలకపోవడమే కాకుండా,చేతుల్లోనే పేలి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటున్నారు. కలసపాడులో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న టపాసుల స్టాళ్లపై రెవెన్యూ,పోలీస్,అగ్నిమాపక శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.వెంటనే క్షేత్రస్థాయిలో ఉమ్మడి తనిఖీలు చేపట్టి,భద్రతా ప్రమాణాలు పాటించని స్టాళ్లను సీజ్ చేయాలని కోరుతున్నారు.అలాగే అధిక ధరలకు,నాసిరకం బాణసంచా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని ‘ప్రజావాణి’ వేదికగా ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.