📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు

📰 Generate e-Paper Clip

*ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు*
*లబ్ధిదారులతో కలిసి స్వీట్స్ పంచుకొని టపాసులు పేల్చిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి*

కొందుర్గు, నవంబర్ 08(మన ప్రజా వాని)

కొందుర్గ్ మండల పరిధిలోని చెరుకుపల్లి, గంగన్న గూడెం, కొందుర్గు గ్రామాల్లో ‘మా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి’ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆయా గ్రామాల సర్పంచులు విక్రమ రెడ్డి,యాదయ్య , కడిగాళ్ల మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి ,ఏఎంసీ చైర్మన్ సులోచన కృష్ణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి చిచ్చుబుడ్లు, టపాసులు కాల్చి పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులందరికీ మిఠాయిలు పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ప్రజా సంక్షేమ పథకం క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,మాజీ పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి ,సీనియర్ నాయకులు రాములు గౌడ్,మాజీ సర్పంచ్ లు కావాలి యాదయ్య,ఫయం,మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లేష్ గౌడ్,గ్రామ ప్రెసిడెంట్ కడిగల్లా మహేందర్,సర్పంచులు విక్రమ్ రెడ్డి,అంజయ్య,యాదయ్య,అమర్నాథ్ రెడ్డి శ్రీకాంత్,పీఏసీఎస్ డైరెక్టర్ లు రాములు,మనయ్య,జీబి కృష్ణ,బోరిగా నరేందర్,వార్డ్ సభ్యులు నర్సింలు, దుర్గాని శ్రీను ,బోరిగా యాదయ్య,మైపాల్ రెడ్డి,మాదారి నర్సింలు,కావాలి లక్ష్మయ్య ,అశోక్,గోపాల్,జిల్లెల ప్రవీణ్,అమృతయ్య, శ్రీనువాస్ రెడ్డి,రాకేష్,రమేష్ ,సాయిరెడ్డి,శశి,సత్యం రెడ్డి దర్శన్ ,రామకృష్ణ గౌడ్,అజీమ్,పద్మయ్య మల్లేష్ బోడ,సాల్వారెడ్డి,చిల్కమర్రి,మర్రిర్డి,రాజు,కుమార్ కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.