ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ప్రజావాణి,ఇనుగుర్తి: జనహృదయ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇనుగుర్తి మండలం చిన్ననాగరం శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్,స్థానిక సర్పంచి,చెడుపాక సుజాత యాకయ్య, వార్డు సభ్యులు బైరు వెంకన్న,ముత్యాల సోమక్క వెంకన్న, నిడిగంటి చంద్రమౌళి,గుండాల మంగమ్మ ధర్మయ్య,చెడుపాక అలివేలు వెంకన్న, నాయకులు బైరు శ్రీనివాస్,కొయ్యడి యాకాంతం గౌడ్ నాయిని కొమరయ్య వినోద దంపతుల తో పాటు పలువురు పాల్గొని ముందుగా మహిమాన్విత
ముత్యాలమ్మ తల్లికి పూజలు చేశారు. కేకు కట్ చేసి మిఠాయిలు పంచారు.అనంతరం అశోక్ గౌడు మాట్లాడుతూ ప్రజా నేత సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు మరో 10 సం.ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించే విధంగా భగవంతుడు శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో నాయకులు బైరు వెంకటయ్య,ఉడుత కొమరుమల్లు,సారకోళ్ల గౌడ్ బైరు వెంకటేశ్వర్లు, బైరు యాదగిరి, మాదాటి రామమూర్తి, వేణు, ప్రగతి వెంకన్న, శేఖర్,మాద గాని ముత్యాలు,జంపయ్య గౌడ్,దర్గయ్య,శేఖర్,ఎలుగల బోయిన యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

