📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల 'మండల పీఠం' ఎవరిది*?దమ్మనపల్లె లక్కినేని సురేష్‌ వర్సెస్ రంగసముద్రం పెట్లు కుమారి.. ఉత్కంఠ రేపుతున్న...

పోరుమామిళ్ల ‘మండల పీఠం’ ఎవరిది*?దమ్మనపల్లె లక్కినేని సురేష్‌ వర్సెస్ రంగసముద్రం పెట్లు కుమారి.. ఉత్కంఠ రేపుతున్న ఎంపీపీ కుర్చీ 

📰 Generate e-Paper Clip

అధికారం అనేది ప్రజా సేవకు లభించే అద్భుత అవకాశం.. కానీ ఆ పీఠం ఎవరిని వరిస్తుందో తేల్చేది కాలం, ప్రజా బలం మరియు అధిష్ఠాన వ్యూహం మాత్రమే?

కడప పోరుమామిళ్ల నవంబర్ 08ప్రజావాణి మండలం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ముగిసిన స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల కౌంటింగ్ ముగియడం, ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు అందరి దృష్టి పోరుమామిళ్ల మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం వైపే మళ్లింది. ఈ మండలంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రుచి చూస్తున్నాయి . అయితే, ఈ ప్రతిష్టాత్మక స్థానం కోసం ఇద్దరు బలమైన అభ్యర్థుల పేర్లు ప్రముఖంగా తెరపైకి రావడంతో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. దమ్మనపల్లె ఎంపీటీసీ లక్కినేని సురేష్‌, రంగసముద్రం వన్ పెట్లు కుమారి లలో ఆ కుర్చీ ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం మండల ప్రజల్లో,రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద బిలియన్ డాలర్ క్వశ్చన్ మార్క్‌గా మారింది.

ఉత్కంఠ రేపుతున్న అభ్యర్థుల రేసు

పోరుమామిళ్ల మండలంలో ఎంపీపీ పదవిని దక్కించుకోవడానికి గ్రూపు రాజకీయం,పార్టీల అంతర్గత సమీకరణాలు వేడెక్కాయి.ఈ రేసులో ఇద్దరు అభ్యర్థులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు:1దమ్మనపల్లె ఎంపీటీసీ సురేష్:స్థానికంగా మంచి పట్టున్న నాయకుడిగా, యువతలో క్రేజ్ ఉన్న అభ్యర్థిగా సురేష్ పేరు గట్టిగా వినపడుతోంది.పల్లెల్లో తనకున్న పరిచయాలు, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం చేసిన సేవలు తదితర అంశాలు తనకు అనుకూలంగా మారుతాయని ఆయన వర్గం నమ్ముతోంది. అధిష్ఠానంలో ఉన్న పెద్దల ఆశీస్సులు తనకే ఉన్నాయంటూ ఆయన మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు.2.రంగసముద్రం వన్ పెట్లు కుమారి:మరోవైపు రంగసముద్రం స్థానం నుండి గెలుపొందిన కుమారి పేరు కూడా ఎంపీపీ రేసులో బలంగా దూసుకుపోతోంది. సామాజిక సమీకరణాలు,మండలంలో మహిళా ప్రాధాన్యత లేదా రిజర్వేషన్ అంశాలు గనుక తెరపైకి వస్తే కుమారికే మొదటి ప్రాధాన్యత దక్కుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి.సీనియర్ల మద్దతుతో పాటు,తటస్థ ఓటర్లను ఆకట్టుకోగల సామర్థ్యం ఆమెకు ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది.

ప్రజల్లో పెరిగిన క్యూస్షన్ మార్క్.. హైకమాండ్ నిర్ణయం ఎటువైపు?

నామినేషన్ల పర్వం నుండి కౌంటింగ్ ముగిసే వరకు పోరుమామిళ్లలో రాజకీయ సెగలు బాగానే కనిపించాయి. ఒకానొక దశలో వర్గపోరు కారణంగా ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకున్నాయి.16ఎంపీటీసీ స్థానాలు ఉన్న ఈ మండలంలో మెజారిటీ సాధించిన పార్టీలో ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.’సురేష్’ వైపు యువత మరియు దూకుడు రాజకీయం మొగ్గు చూపుతుండగా.. కుమారి’ వైపు సీనియర్లు, సమతుల్య రాజకీయం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.దీంతో ఈ స్థానం ఎవరికి కల్పిస్తారు? ఎవరిని మండల ప్రథమ పౌరుడిగా ఎన్నుకుంటారు? అనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అధిష్ఠానం ఎవరికి బి-ఫారమ్ ఇస్తుంది, ముసుగులో ఉన్న అంతర్గత ఒప్పందాలు ఏమిటి అనే విషయాలు త్వరలోనే తేలనున్నాయి.ఏది ఏమైనప్పటికీ, పోరుమామిళ్ల ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునే అభ్యర్థిపై మండల ప్రగతి,సమీకరణాలు ఆధారపడి ఉంటాయి.ఒకవైపు సురేష్ అనుచరులు,మరోవైపు కుమారి మద్దతుదారులు తమ అభ్యర్థే పీఠం ఎక్కుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ రాజకీయ చదరంగంలో తుది విజేతగా నిలిచి, పోరుమామిళ్ల మండల రాజ భవనంలో అడుగుపెట్టే ఆ ‘రాజు’ లేదా ‘రాణి’ ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.