📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కుల వివక్ష లేని సమాజ సాకారం కోసం ఉద్యమించాలి : వ్య.కా.స రాష్ట్ర కోశాధికారి కె....

కుల వివక్ష లేని సమాజ సాకారం కోసం ఉద్యమించాలి : వ్య.కా.స రాష్ట్ర కోశాధికారి కె. ఆంజనేయులు వర్క్ షాప్ లో కార్యాచరణ ప్రణాళిక

📰 Generate e-Paper Clip

కడప అర్బన్ జూలై 11 ప్రజావాణి కుల వివక్ష లేని సమాజ సాకారం కోసం యువత ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కె.ఆంజనేయులు పిలుపునిచ్చారు.శనివారం ప్రెస్ క్లబ్ లో కెవిపిఎస్,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం అనే అంశంపై జిల్లా స్థాయి వర్క్ షాప్ వ్య.కా.స జిల్లా కార్యదర్శి అన్వేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కులాంతర వివాహల బారిన పడిన యువతను తుద ముట్టిస్తున్న ఘటనలు అనేకం చూస్తూ ఉన్నామని పేర్కొన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నుంచి నేటి కమ్యూనిస్టుల వరకు కులాంతర వివాహాలను ప్రోత్సహించారని తెలిపారు.అంతిమయాత్రలోనూ దళితులకు అవహేళనే ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల స్మశానాలను పెత్తందారుల ఆక్రమణలో ఉన్నాయని చెప్పారు.ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ కేసులో దొరికాడని, అటువంటివారిని వదిలేశారని పేర్కొన్నారు.మనుధర్మ శాస్త్రం ప్రకారం దళితులు తప్పు చేస్తే శిక్ష, పెత్తందారులు చేస్తే సత్కారమా అని ప్రశ్నించారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం హాజరు కాదని,సుప్రీంకోర్టు జడ్జిపై ఓ మత దురహంకార న్యాయవాది బూటు విసిరేసే ధైర్యం మనుధర్మ శాస్త్రం నుంచే వచ్చిందని తెలిపారు. మధురై మహాసభల్లో వర్గ ఉద్యమాలతో పాటు సామాజిక ఉద్యమాలు చేపట్టడంలో భాగంగా కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న ప్రకృతి వనరుల దోపిడీ కొనసాగుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్మాదం పెరగడానికి కూటమి సర్కార్ దోహదం చేస్తుందని విమర్శించారు.ప్రభుత్వం కులాల పేరిట కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా కుల వివక్షను పెంపొందిస్తుందని పేర్కొన్నారు.కూటమి సర్కార్ దళితవాడలలో పాఠశాలలను రద్దు చేస్తుందని తెలిపారు. 1929లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దళితుల కోసం గుడి ప్రవేశానికి ప్రయత్నం చేస్తే,కేరళలో డీకే గోపాలన్ దీక్షలు,సుందరయ్య పోరాటాలు చేశారని చెప్పారు.దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ పై సుప్రీంకోర్టు తీర్పు చర్చనీయాంశంగా ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్రపతి సవరించి ఇవ్వాలని కోరారు.1956లో సిగ్గు దళితులు పోరాడి రిజర్వేషన్స్ సాధించుకున్నారని తెలిపారు. 1999లో వీపీ సింగ్ రిజర్వేషన్స్ ఇచ్చారని గుర్తు చేశారు. దళితులు మారితే రిజర్వేషన్స్ పోతాయని,బిసిలు ఓసీలు మారితే రిజర్వేషన్స్ పోవని పేర్కొన్నారు.దళితులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.వర్క్ షాప్ లో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు శివకుమార్ అన్వేష్,ఉపాధ్యక్షులు జి.చంద్రశేఖర్,సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీదేవి, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం, పట్టణ ప్రాంత పేదల నిర్మూలనా సంఘం జిల్లా నాయకులు రామమోహన్,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్,రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి ప్రసంగించారు. వర్క్ షాప్ లో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు రఘు,నగర కార్యదర్శి నరసింహ,వివిధ ప్రజా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.అనంతరం కార్యాచరణ ప్రకటించారు.ఈ నెల15 లోపు మండల, పట్టణ కమిటీల సమావేశం ముగించాలి.16నుంచి 26 వరకు అధ్యయన యాత్రలు.27నుంచి30 వరకు సచివాలయాల్లో వినతి పత్రాల అందజేత.ఆగస్టు 3,4మండల కార్యాలయాల వద్ద ధర్నాలు.15న సమైక్యత దినోత్సవం నిర్వహణ.16 నుంచి 21వరకు ప్రచార యాత్రలు. 22,23న సన్నాహక సమావేశాలు. 24న కలెక్టరేట్ ముట్టడి, ధర్నాలు చేయాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.