📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఅన్నోజిగూడలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి:...

అన్నోజిగూడలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్

📰 Generate e-Paper Clip

పోచారం, జూలై 14 (ప్రజావాణి): పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నోజిగూడ అయ్యప్ప దేవాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు సవరణ) అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు.

ఈ సందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని సూచించారు.

అనంతరం ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి బీఎల్‌ఏలు, సంబంధిత బాధ్యులతో సమావేశమై పెండింగ్‌లో ఉన్న ఫారాలు, ఫారం-6, ఫారం-6ఏ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.

పర్యటన సందర్భంగా గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, పెన్షన్లు, రేషన్, గృహాలు తదితర ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కర్రె రాజేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల కృష్ణారెడ్డి, టీం రేవంత్ రెడ్డి పోచారం మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, మాజీ ఉపాధ్యక్షులు బద్రి హేమంత్, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఓబీసీ కన్వీనర్ చంద్రకాంత్, 2వ వార్డు అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు ఎర్ర రాజు, మాజీ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవి, మల్లికార్జున్ రెడ్డి, బద్దం నరసింహారెడ్డి, చుంచు నర్సింహ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.