📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఆర్‌జీకే కాలనీలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ... పార్టీ బలోపేతానికి కార్యకర్తలు...

ఆర్‌జీకే కాలనీలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ… పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్

📰 Generate e-Paper Clip

పోచారం, జూలై 14 (ప్రజావాణి): పోచారం 8వ డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప (ఆర్‌జీకే) కాలనీలో పోచారం డివిజన్ 8 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేవేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పోచారం డివిజన్ 8 వ వార్డు అధ్యక్షులు కర్రె రాజేష్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై అవగాహన కార్యక్రమం కూడా చేపట్టారు.

ఈ సందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని సూచించారు.

అనంతరం ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి బీఎల్‌ఏలు, పార్టీ నాయకులతో సమావేశమై పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పర్యటన సందర్భంగా కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, పెన్షన్లు, రేషన్, గృహాలు తదితర ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కర్రె రాజేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటికాల కృష్ణ పోచారం డివిజన్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీం రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకులు పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాజీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్,మాజీ ఉపాధ్యక్షులు దేవేందర్ ముదిరాజ్, పల్లపు రమేష్,గందమల్ల రమేష్ గౌడ్, రవీందర్ బాబు,బాల రాములు, రమేష్ ముదిరాజ్, నాగరాజు, జాఫర్ ఖాన్, యు. వెంకటేష్, ఆంజనేయులు గౌడ్,వినయ్, మధుకర్ రెడ్డి, వంగాల లక్ష్మి, పద్మావతి శశికళ, నాగరాణి, పావని, భాగ్యలక్ష్మి, పద్మ, గౌరి, సీహెచ్. రేణుక, జి. రేణుక తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.