📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువతతో సమావేశం

నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువతతో సమావేశం

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి22) బద్వేల్ మండలం బయనపల్లె గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదళం అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువతతో సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2019 నుండి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద విద్యార్థులు,మహిళలు,వృద్ధులకు ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు.అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతోందని విమర్శించారు.అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు,సోషల్ మీడియా కార్యకర్తలపై ఒత్తిడులు ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా పార్టీకి అండగా నిలవాలని యువతకు పిలుపునిచ్చారు. “మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీ వెంట నేను ఉంటాను” అంటూ దేవసాని ఆదిత్య రెడ్డి గారు భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేయాలని, 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని యువతకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు సాయి నారాయణరెడ్డి, రవి కుమార్ రెడ్డి,గోవర్ధన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.