📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonబొట్ల చిలుకమ్మ మృతికి నివాళి అర్పించిన కాంగ్రెస్ ఎస్సి సెల్ నాయకులు

బొట్ల చిలుకమ్మ మృతికి నివాళి అర్పించిన కాంగ్రెస్ ఎస్సి సెల్ నాయకులు

📰 Generate e-Paper Clip

**బొట్ల చిలుకమ్మ మృతికి నివాళి అర్పించిన కాంగ్రెస్ ఎస్సి సెల్ నాయకులు*

జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 20 (ప్రజావాణి):
జనగామ పట్టణ కేంద్రంలోని 30వ వార్డు మాజీ కౌన్సిలర్, టీపీసీసీ ఎస్సి సెల్ వైస్ చైర్మన్, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి బొట్ల శ్రీనివాస్ తల్లి బొట్ల చిలుకమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతికి సంతాపంగా ఆదివారం కాంగ్రెస్ ఎస్సి సెల్ నాయకులు సంతాప సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా చిలుకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

ఈ సంతాప సభ కార్యక్రమంలో జనగామ డీసీసీ ఎస్సి సెల్ జనరల్ సెక్రెటరీ అల్వాల రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొట్ల నర్సింగరావు, జిల్లా కమిటీ ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శులు కళ్యాణం సమ్మయ్య, రామగళ్ళ కృష్ణ, దండు శ్రీనివాస్, చిన్న, మండలం ఎస్సి సెల్ అధ్యక్షులు పరశురాములు, జిల్లా సహాయ కార్యదర్శి హెడేల్లి క్రాంతి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.