📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు 'శ్రేష్ట' చేయూతరూ. 1,01,116 విరాళం అందజేసిన తగరం ఇమ్మానియేల్

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ‘శ్రేష్ట’ చేయూతరూ. 1,01,116 విరాళం అందజేసిన తగరం ఇమ్మానియేల్

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి22)కనిగిరి పట్టణంలో నూతనంగా ప్రతిష్టించ తలపెట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సామాజిక బాధ్యతతో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.ఇందులో భాగంగా శ్రేష్ట ఫౌండేషన్ అధ్యక్షులు తగరం ఇమ్మానియేల్ ఆదివారం తన ఉదారతను చాటుకున్నారు. విగ్రహ నిర్మాణ నిధి కోసం ₹1,01,116 రూపాయల భారీ విరాళాన్ని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ఆయన నివాసంలో స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా తగరం ఇమ్మానియేల్ మాట్లాడుతూ.దేశ గమనాన్ని మార్చిన మహనీయుడు,అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో భాగస్వామిని కావడం తన పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నట్లు తెలిపారు.జాతీయ స్థాయిలో ఎనలేని గుర్తింపు పొందిన బాబాసాహెబ్ ఆశయాలను స్మరించుకుంటూ, కనిగిరిలో పునఃప్రారంభించనున్న ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.