టేస్టింగ్ సాల్ట్ పేరిట తెల్లటి విషం..పోరుమామిళ్ల హోటళ్లలో యథేచ్ఛగా ప్రాణాలతో చలగాటం!లైసెన్సులు లేవు. క్లీనింగ్ అస్సలే లేదు! పోరుమామిళ్లలో సాగుతున్న ‘కల్తీ’ మాఫియా రాచరికం! ప్లేటు నిండా కెమికల్స్.. కడుపు నిండా రోగాలు!
అధికారులారా..పోరుమామిళ్ల జనం ప్రాణాలు అంత చౌకనా?డబ్బులు మీవి..రోగాలు మీవి.. లాభాలు మాత్రం హోటల్ బాబులవి!
పోరుమామిళ్ల జూన్ 08 ప్రజావాణి లోని పలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఆహార పదార్థాల తయారీలో టేస్టింగ్ సాల్ట్ (అజినోమోటో) విచ్చలవిడిగా వాడుతూ, ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు.ఈ రసాయనం వల్ల ఆహారానికి కృత్రిమ రుచి, ఘాటు వస్తున్నప్పటికీ, ఇది తిన్న ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు.ఈ అంశంపై ప్రజలను చైతన్య పరిచేందుకు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు రుచి వెనుక రోగం.. పోరుమామిళ్లలో టేస్టింగ్ సాల్ట్ విలయం,మీరు హోటల్‌కు వెళ్లి ఘాటుగా,రుచిగా ఉందని ఇష్టంగా తింటున్నారా? అయితే జాగ్రత్త! ఆ రుచి వెనుక ప్రాణాంతక రసాయనాలు దాగి ఉన్నాయి. పోరుమామిళ్ల పట్టణంలోని పలు రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లు, రోడ్‌సైడ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఆహార పదార్థాల తయారీలో టేస్టింగ్ సాల్ట్ (మోనోసోడియం గ్లుటామేట్ – MSG) విచ్చలవిడిగా వాడుతున్నారు. చికెన్ రైస్, నూడుల్స్, బిర్యానీ, మంచూరియా వంటి పదార్థాలకు ఘాటైన రుచిని రప్పించడానికి వ్యాపారులు ఈ తెల్లటి రసాయనాన్ని గుప్పిళ్ల కొద్దీ గుమ్మరిస్తున్నారు.నిబంధనలు బేఖాతరు.లాభాలే పరమావధిఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం టేస్టింగ్ సాల్ట్‌ను పూర్తిగా నివారించాలి. కానీ, పోరుమామిళ్లలోని కొందరు కేటరర్లు, హోటల్ నిర్వాహకులు వినియోగదారులను ఆకర్షించడానికి, తమ వ్యాపార లాభాల కోసమే ప్రాధాన్యత ఇస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి, ఘాటు తీసుకురావడమే లక్ష్యంగా ఈ విషాన్ని వడ్డిస్తున్నారు.పొంచి ఉన్న ఆరోగ్య ముప్పువైద్యుల హెచ్చరికల ప్రకారం ఈ టేస్టింగ్ సాల్ట్ కలిపిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల కింది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి నరాల బలహీనత: మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం పడి, జ్ఞాపకశక్తి మందగిస్తుంది.గుండె జబ్బులు రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా పెరిగి గుండె జబ్బులకు దారితీస్తుంది.జీర్ణకోశ వ్యాధులు కడుపులో మంట, అల్సర్లు, కాలేయం (లివర్) పాడయ్యే ప్రమాదం ఉంది.చిన్నపిల్లలపై ప్రభావం ఈ ఆహారం తిన్న పిల్లలలో ఊబకాయం,ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి.అధికారులు ఏం చేస్తున్నారు?స్థానిక ప్రజలు కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నా, ఇక్కడి ఆహార భద్రతా అధికారులు (Food Safety Officers) మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.హోటళ్లలో కనీస తనిఖీలు లేకపోవడం వల్లే వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతోంది.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి,పోరుమామిళ్లలోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై తక్షణమే దాడులు నిర్వహించి, రసాయనాలు కలుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు,




