📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు

📰 Generate e-Paper Clip

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు


కోదాడ ఆగష్టు 6,ప్రజావాణి : కోదాడ లోని ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో జోనల్ ఇంచార్జ్ స్నేహలత ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్నేహలత బోనం ఎత్తుకొని విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలగాలని దేవతను కోరుకున్నారు. దేవత ఆశీస్సులతో వర్షాలు బాగా కురిసి పాడిపంటలు బాగా పండాలని దేవతను కోరుకున్నారు. విద్యార్థులకు సంస్కృతి,సాంప్రదాయ విలువలను తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు. ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం అన్నారు. ప్రతి పండుగ మానవతా విలువలను మరియు ఉన్నత విలువలను తెలియజేస్తాయన్నారు. విద్యార్థుల వేషధారణ అందరిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు,విద్యార్థిని, విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular