📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

పోరుమామిళ్ల బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల,ఆగస్టు 5(ప్రజావాణి) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం తో మండలం లో జాతీయ రహదారుల నిర్మాణం ,అతిపెద్ద టన్నెల్ నిర్మాణం జరగడం మండల అభిరుద్ది కి నాంది అని బీజేపీ పిలుపు ఇచ్చారు,కూటమి సహకారం తో స్థానిక సంస్థలకు సంసిద్ధం కావాలి బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి నాయకులు కోరడమైనది భారతీయ జనతాపార్టీ బీజేపి పోరుమామిళ్ల మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు నాగేంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్బంగా మండల ఇంచార్జి గవేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ మండలం లో బిజెపిని బలోపేతం చేయడానికి బీజేపీ నాయకత్వం ప్రత్యేక ద్రృష్టి సారించింది అని,దీనిలో భాగంగానే బీజేపీ కార్యకర్తలకు,నాయకులకు సమన్వయం చేసి రాబోయే స్థానిక సంస్థలలో ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం మార్గ నిర్దేశం చేశారు.స్థానిక సంస్థలకు పోటీ చేసే ఎంపీటీసీ,జడ్పిటిసి,పంచాయతీల జాబితాను పార్టీ నాయకత్వానికి పంపడం జరుగుతుంది అని తెలిపారు.బి ఎల్ ఏ1 భాస్కర్ రెడ్డి అధికార ప్రతినిధి నరోజు రమణ చారి,టోలీ ఇంచార్జి పండరి,జిల్లా ఉపాధ్యక్షుడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజలతో మమేకమై నరేంద్ర మోడీ పన్నెండు ఏళ్ల సుపరిపాలన,పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి ప్రజల్లో బీజేపీ పార్టీ పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ప్రతీ కార్యకర్త క్రృషి చేయాలని,రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బీజేపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని,18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పొందే విధంగా బీఎల్వోలతో సమన్వయం చేస్తూ పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దుల్ల శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యక్షులు చెన్నయ్య,పోకల బ్రహ్మయ్య , కిసాన్ మోర్చా తమ్మిశెట్టి రమణ,కార్యవర్గ సభ్యుడు వంకదారి జయరాం,యువ నాయకుడు మంగళగిరి భరత్ ఓబీసీ మోర్చా శ్రీను,ఉపాధ్యక్షుడు గౌరీ శర్మ ,కార్యవర్గ సభ్యుడు,తదితర బీజేపీ కార్యకర్తలు పాల్గొనరు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular