📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ను కలిసిన మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ను కలిసిన మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి

📰 Generate e-Paper Clip

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ను కలిసిన మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి


అనంత పురం బ్యూరో ఆగస్ట్ 05 ప్రజా వాణి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  వ్యవసాయ & మార్కెటింగ్ శాఖ మంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు ని అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి మర్యాదపూర్వకంగా కలిశారు .అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు, వ్యాపారుల సౌకర్యార్థం జంబో ఫ్రూట్ షెడ్ నిర్మాణం, సి.సి. డ్రెయిన్ నిర్మాణం, పాత గోదాముల తొలగింపు తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించడం జరిగింది.ఈ ప్రతిపాదనలపై మంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితులు, మార్కెట్ యార్డు అభివృద్ధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular