📄 ePaper
Tuesday, June 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రుద్ర సముద్రం గ్రామంలో కిషోరి వికాసం కార్యక్రమం

రుద్ర సముద్రం గ్రామంలో కిషోరి వికాసం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

దొనకొండ (మే 15) ప్రజావాణి ప్రకాశం జిల్లా బ్యూరో: స్థానిక మండలంలోని దొనకొండ సెక్టార్ పరిధిలో రుద్ర సముద్రం గ్రామంలో శుక్రవారం సచివాలయం పరిధిలోని అంగనవాడి కేంద్రం నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ సిహెచ్ సుభాషిని ఆధ్వర్యంలో కిషోరీ వికాసం కార్యక్రమం జరిగినది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా కిషోరీ బాలికలకు లైంగిక ప్రత్యుత్పత్తి, ఆరోగ్యం నా అవసరాలు మన సవాళ్లు గురించి తెలియజేశారు. ప్రతి బాలికకు జీవించే హక్కు, అభివృద్ధి చందే హక్కు, మంచి విద్యను పొంది హక్కు ఉన్నాయని అన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం పరిశుభ్రత, భద్రత మరియు రక్షణ ప్రతి బాలికకువెంతైన అవసరం ఉందని తెలిపారు. దైర్యం గా మాట్లాడే అలవాటును పెంపొందించుకోవాలని అన్నారు. ఈ క్రమంలో డిప్యూటీ ఎంపిడిఓ రాధ కృష్ణమూర్తి, పంచాయతీ సెక్రటరీ బాబు, అంగన్వాడీ కార్యకర్త లలితమ్మ, ఆశ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular